మనామలో అగ్నిప్రమాదం
- June 15, 2017మనామాలో ఒక నిషేధమైన షెడ్ లో ఒక అగ్నిప్రమాదం జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రదేశంలో అగ్నిప్రమాదం జరగడం రెండవ సారి అని తెలిపారు.అగ్ని ప్రమాదం జరిగిన స్థలం ఉన్న రెండు నివాస భవనాల మధ్య ఉంది. దీనితో అక్కడ నివాసితులు తమ వద్ద ఉన్న చెత్తాచెదారాలను ఖాళీగా ఉన్న ఆ ప్రదేశం వైపు విసిరి పారవేస్తుంటారు. ఈ క్రమంలో ఎవరో ఒక వ్యక్తి నిప్పు ఆర్పని సిగరెట్ ను ఆ చెత్తపైకి విసరడంతో అది రగిలి చెత్తను మండించి ఉండొచ్చని అక్కడ నివాసితులు ఊహిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఏ కారణం చేతనో ఒక్కసారిగా వేగంగా మంటలు వ్యాపించేలా చేసింది. గురువారం ఉదయం 11 గంటల సమయంలో సివిల్ డిఫెన్స్ ఆ ప్రాంతానికి చేరుకొని మంటలను ఆర్పీ పరిస్థితిని అదుపులోనికి తెచ్చింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికి ఎటువంటి గాయాలు కాలేదని అగ్నిమాపక సిబ్బంది పేర్కొంది. ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణం తెలుసుకొనేందుకు అధికారులు పరిశోధనలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక