నేపాల్ 38వ ప్రధాన మంత్రిగా కెపి శర్మ ఓలి
- October 12, 2015
నేపాల్ నూతన ప్రధాని ఎన్నికైన పిపిఎన్ (యుఎంఎల్) చైర్మన్ కెపి శర్మ ఓలి సోమవారం నాడిక్కడ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆయనతోపాటు ఎనిమిది మంది కొత్త మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ ( యునైటెడ్ మార్క్సిస్టు, లెనినిస్టు) చైర్మన్ ఓలి మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలపై విజయం సాధించిన తెలిసిందే. సోమ వారం శీతల్ నివాస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అధ్య క్షుడు రామ్‌భరణ్ యాదవ్ నూతన ప్రధాని ఓలి, ఉప ప్రధా నులు విజయ కుమార్ గచ్ఛాదర్, కమల్ థాపాల చేత ప్రమా ణ స్వీకారం చేయించారు. వీరిలో విజరుకుమార్ గచ్ఛాదర్ మాదేశీ జనాధికార్ ఫోరమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కమల్ థాపా ప్రజాతంత్ర, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రులుగా అగ్ని ఖేరెల్, సత్య నారాయణ్ మండల్, సోమ్ పాండే, హరీబాల్ గజురెల్, రామ్ కుమార్ సుబ్బా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు ఏయే శాఖలు కేటాయించినది ఇంకా తెలియరా లేదు. నేపాల్ కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చాక 38వ ప్రధాన మంత్రిగా కెపి శర్మ ఓలి పదవీ బాధ్యతలు చేపట్టారు
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







