దీక్ష విరమించాలని పోలీసులు జగన్‌ను కోరారు
- October 12, 2015
ప్రత్యేక హోదాకోసం నిరవదిక దీక్ష చేస్తున్న వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం వేకువజామున పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో అత్యవసర సేవల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. సోమవారం రాత్రి నిర్వహించిన వైద్య పరీక్షల్లో జగన్మోహన్రెడ్డికి వైద్యం అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంగళవారం వేకువజాము వరకు దీక్ష ప్రాంగణం వద్దనే వేచి ఉన్నారు. తొలుత దీక్ష విరమించాలని పోలీసులు జగన్‌ను కోరగా ఆయన నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబులెన్స్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే ప్రత్యేక బృందంతో ఉన్న పోలీసులు భారీగా మోహరించి జగన్‌ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడ కార్డియాలజీ విభాగంలో జగన్‌కు వైద్యసేవలందించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







