డిసెంబర్ 17 అమరవీరుల దినోత్సవం.!
- October 13, 2015
డిసెంబర్ 17వ తేదీని జాతీయ అమరవీరుల దినోత్సవంగా నిర్వహించనున్నట్లు కింగ్ హమాద్ వెల్లడించారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ మరియు డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ మరియు ఫస్ట్ డిప్యూటీ ప్రీమియర్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సమక్షంలో ఈ నిర్ణయాన్ని కింగ్ ప్రకటించారు. వివిధ పథకాల్ని అమలు చేసే క్రమంలో ప్రజా ప్రతినిథులు చూపిస్తోన్న శ్రద్ధను కింగ్ హమాద్ కొనియాడారు. ఆర్థిక స్వావలంభన, ఆర్థిక వృద్ధి కోసం ఇంకా కృషి చేయవలసి ఉందని, ప్రభుత్వ ఇంకా మెరుగ్గా పనిచేసేందుకు కొన్ని శాఖల్ని విలీనం చేయడం జరిగిందన్నారాయన. యెమెన్లో శాంతి కోసం బహ్రెయిన్ సైనికులు చేస్తున్న కృషిని కింగ్ హమాద్ అభినందించారు. ఈ క్రమంలో వీరోచితంగా పోరాడి మరణించినవారికి కింగ్ హమాద్ సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరగకుండా చేయడంలో భద్రతాదళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







