జెవిసి సర్కిల్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల సమస్య
- October 13, 2015
జుమైరా విలేజ్ జర్కిల్లో స్థానికులు ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. పీక్ టైమ్‌లో ఈ ఇబ్బందులు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రవేశించే మార్గం, బయటకు వెళ్ళే మార్గం అల్ ఖయిల్ రోడ్‌కి దూరంగా ఉన్నాయని, దాంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెప్పారు. 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళితేగానీ యూ టర్న్ లేకపోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు. 15 వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించాలని కోరుతున్నారు వారంతా. ఉదయం 7 నుంచి 9.30 గంటల సమయంలో ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంటోందని, వర్క్ కోసం బయటకు వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలన్నా నరకం చూస్తున్నామని ఇగ్లాండ్కి చెందిన జెన్ విల్సన్ చెప్పారు. అయితే కన్స్ట్రక్షన్ కంపెనీలను సంప్రదిస్తున్నామనీ, అతి త్వరలో సమస్యకు పరిష్కారం చూపుతామని జెవిసి డెవలపర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







