జెవిసి సర్కిల్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల సమస్య

- October 13, 2015 , by Maagulf
జెవిసి సర్కిల్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల సమస్య

జుమైరా విలేజ్‌ జర్కిల్‌లో స్థానికులు ట్రాఫిక్‌ కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. పీక్‌ టైమ్‌లో ఈ ఇబ్బందులు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రవేశించే మార్గం, బయటకు వెళ్ళే మార్గం అల్‌ ఖయిల్‌ రోడ్‌కి దూరంగా ఉన్నాయని, దాంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెప్పారు. 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళితేగానీ యూ టర్న్‌ లేకపోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు. 15 వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించాలని కోరుతున్నారు వారంతా. ఉదయం 7 నుంచి 9.30 గంటల సమయంలో ట్రాఫిక్‌ చాలా ఇబ్బందికరంగా ఉంటోందని, వర్క్‌ కోసం బయటకు వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలన్నా నరకం చూస్తున్నామని ఇగ్లాండ్‌కి చెందిన జెన్‌ విల్సన్‌ చెప్పారు. అయితే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలను సంప్రదిస్తున్నామనీ, అతి త్వరలో సమస్యకు పరిష్కారం చూపుతామని జెవిసి డెవలపర్‌ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com