4 మెట్రో స్టేషన్లలో లైబ్రరీలు
- October 13, 2015
దుబాయ్‌లోని 4 మెట్రో స్టేషన్లలో పబ్లిక్ లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నారు. వైస్ ప్రెసిడెంట్ మరియు యూఏఈ ప్రధాని, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తౌమ్ ఇటీవల ప్రారంభించిన 'రీడింగ్ ఛాలెంజ్' ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ లైబ్రరీలను మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేస్తారు. వివధ రకాలైన పుస్తకాల్ని మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంచుతారనీ అధికారులు వివరించారు. ఇది మొదటి స్టెప్ అనీ, రెండో స్టెప్‌గా నాలెడ్జ్ ఛైర్స్ని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వాటిల్లో ఐబిఎన్ బత్తుల మాల్ మరియు మాల్ ఆఫ్ ఎమిరేట్స్, ఆర్టిఎ ప్రధాన కార్యాలయం ఉంటాయి. యూనివర్సిటీల్లోనూ, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఔత్సాహికులు చదువుకునేందుకు వీలుగా లైబ్రరీలను ఏర్పాటు చేస్తారు. పాఠకుల్ని ఆకర్షించేందుకు బహుమతులు కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







