నిద్రమాత్రల వలన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు
- October 13, 2015
ప్రస్తుత రోజుల్లో చాల మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇది సాధారణ సమస్యగా మారినది. ఎప్పుడైతే మీరు సరిగా రెస్ట్ తీసుకోకపోతే, మీ శరీరం ఎక్కువ ఒత్తిడికి గురి అవుతుంది. దాంతో నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు చాలా మంది చేసే ప్రధానమైన పరిష్కార మార్గం నిద్రమాత్రలకు అలవాటు పడటం! నిద్ర పోవాలంటే, కొంతమంది నిద్రమాత్రలు వేసుకోకుండా నిద్రపోలేరు. ఈ మాత్రలు తాత్కాలికంగా మీకు నిద్ర పట్టించినప్పటికి శరీరానికి హాని చేస్తాయి. బాగా నిద్రపోవాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే నిద్రమాత్రలు తాత్కాలిక పరిష్కార మార్గం. అనారోగ్యం రిత్యా డాక్టర్ సలహా మేరకు నిద్రమాత్రలు తీసుకుంటే పర్వాలేదు కానీ, వ్యక్తిగతంగా తమంతట తాము తీసుకోకూడదు. నిద్రమాత్ర విషయంలో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకూడదు. నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకొనే కొద్ది శరీరంలో దుష్ప్రభావాలు ఎక్కువ అవుతాయి. నిద్ర గురించి మీకు తెలియని 12 వాస్తవాలు మరి నిద్రమాత్రలు తినడం వల్ల ఎదురయ్యే ఆ దుష్ప్రభావాలేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా చూద్దాం... దీర్ఘకాలం నుండి నిద్రమాత్రలు తరచూ తీసుకుంటుంటే, దాని అవశ్యం మరింత పెరుగుతుంది. కాబట్టి ప్రతి సారి ఎక్కువ మోతాదులో తీసుకోవల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాత్రతలు ఒక వారంకు మంచి ఎక్కువగా తీసుకోకూడదు. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి. నిద్రమాత్రలు తినడం వల్ల ఇవి నిధానంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటాయి. ఈ నిద్రమాత్రల ప్రభావం మార్నింగ్ వరకూ ఉన్నట్లైతే అది దినచర్య మీద ప్రభావం చూపుతుంది. దాంతో మీ జీవితం ప్రమాధంలో పడుతుంది. నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రమాధకరమైన ఆమ్నీషియా జబ్బుకు దారితీస్తుంది. కాబట్టి, మీరు తీసుకొనే మాత్రల్లో మార్పుతు తీసుకోవల్సి ఉంటుంది. స్లీపింగ్ పిల్స్ వల్ల మరో సైడ్ ఎఫెక్ట్ కళ్ళు తిరగడం మరియు పడి పోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిలో వెంటనే హాస్పిటల్లో చేర్చకపోతే చాలా ప్రమాధం జరగుతుంది. నిద్రమాత్రలు తినడం వల్ల మోతాదు ఎక్కువైతే కోమాలోని వెళ్ళడం లేదా మరణం పొందవచ్చు. నిద్రమాత్రల వల్ల శ్వాసలో ఇబ్బందులు కలుగుతాయి. దాంతో ప్రాణాంతక ప్రమాదంగా మారుతుంది. నిద్రమాత్రలు ఎక్కువ రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటుంటే క్యాన్సర్ కు దారి తీస్తుందని కొన్ని పరిశోధన ద్వారా తెలిసింది . కాబట్టి, నిద్రలేమి సమస్యను నివారించుకోవడానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిద్ర మాత్రలు మీ శ్వాసను నెమ్మదిస్తాయి. గాఢ శ్వాస లేకుండా చేస్తాయి. ఆస్తమా రోగులకు ఈ మందులు అసలు మంచివి కావు. కనుక వీరు నిద్రమాత్రలు తీసుకోరాదు. నిద్రమాత్రలు మీ ఆకలిని చంపేస్తాయి. జీవక్రియ మందగిస్తుంది. కొంతమంది నిద్రమాత్రలు ఆల్కహాల్ తో కలిపి తీసుకుంటారు. ఇది ప్రమాదకరం. మరణానికి దోవతీస్తుంది కూడాను. ద్రాక్షరసంతో కూడా కలిపి తీసుకోకండి. నిద్రపోయినప్పటికి అసాధారణ కలలు వస్తాయి. నిద్రమాత్రలు, మత్తు కలిగించి, ఉదయమే తలనొప్పి, అలసట, దాహం, బలహీనం, చూపు మందగించటం చేస్తాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







