పోర్చుగల్ అడవుల్లో మంటలు: 57 మంది మృతి, కార్లలోనే 30 మంది.
- June 18, 2017
పోర్చుగల్ అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 57 మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మంటలు రోడ్డు పక్కనే ఉన్న కార్లకు వ్యాపించడంతో ప్రాణాపాయం పెద్ద ఎత్తున సంభవించింది.
దాదాపు అరవై మంది గాయపడ్డారు. మంటలను అదుపు చేసేందుకు 160 అగ్నిమాపక యంత్రాలు, వందల సంఖ్యలో సిబ్బంది శ్రమిస్తుంది.
అడవుల్లో ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం గత కొన్ని సంవత్సరాలుగా చూడలేదని ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టా అన్నారు. కార్లకు మంటలు వ్యాపించడంతో కార్లలో ఉన్న వ్యక్తులు కాలి బూడిదయ్యారని అధికారులు పేర్కొన్నారు. కార్లలో చనిపోయిన వారే 30 మందికి పైగా ఉన్నారని తెలుస్తోంది.
దట్టమైన పొగ కారణంగా మరికొందరు మృతి చెందారు. గాయపడిన వారిలో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. అగ్ని ప్రమాదానికి మెరుపులే కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
అడవికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అడవుల్లో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు వాటర్ ప్లేన్స్‌ను ఉపయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







