బాలీవుడ్ నటి కృతికా చౌదరి మృతి
- June 19, 2017
ఈ మద్య వెండి తెర, బుల్లి తెరపై విషాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారు భవిష్యత్ పాడు చేసుకుంటున్నారు. క్షణికావేషంతో నిండు ప్రాణాలను బలి చేసుకుంటున్నారు కొంత మంది సెలబ్రెటీలు. తాము అనుకున్న స్థాయిలో విజయాలు సాధించక కొంత మంది...ఇండస్ట్రీలో తమ కెరీర్ పాడైపోయిందని కొంత మంది..ప్రేమలో విఫలం కావడంతో కొంత మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ మద్య బాలీవుడ్ నటి కృతికా చౌదరి (30) ముంబైలోని అంధేరీ ప్రాంతంలోని తన ఇంట్లో అంతు చిక్కని పరిస్థితుల్లో విగతజీవిగా కనిపించింది.
కృతికా చౌదరి
అసలు విషయానికి వస్తే..కృతికా చౌదరిని ఎవరో అజ్ఞాత వ్యకులు బలమైన ఆయుధంతో కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఆ కేసు ఎంక్వెయిరీ నడుస్తుంది..ఇంతలోనే మరో వర్థమాన నటి అర్థరాతంరంగా తనువు చాలించింది. ముంబైలో ఈ మద్య మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న అంజలి శ్రీవాస్తవ పశ్చిమ అంధేరీలో తన అపార్ట్ మెంట్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుంది.
ఓ జాతీయ మీడియా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ట్వీట్ చేసింది. ఈ రోజు ఉదయం ముంబై పశ్చిమ అంధేరిలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు గుర్తించిన స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనకు చేరుకున్న పోలీసులకు కొన్ని అనుమానాలు కలిగించేలా ఉన్నాయని..అంజలి తన ఫ్లాట్ లో ఉరేసుకుని చనిపోయిందని చెబుతున్నప్పటికీ, శరీరం వేలాడి ఉన్న స్థితి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయినప్పటికీ, పోలీసులు కేసును సూసైడ్ గానే నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంజలి బాలీవుడ్ తోపాటు మరాఠీ, భోజ్ పురి చిత్రాల్లో సహాయక పాత్రలు చేసింది. ఆమె డెడ్ బాడీని కూపర్ ఆస్పత్రికి పోస్ట్ మార్టం కోసం పంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







