డైరెక్టర్ గా మారనున్న హీరోయిన్ ఛార్మి

- June 19, 2017 , by Maagulf
డైరెక్టర్ గా మారనున్న హీరోయిన్ ఛార్మి

ఈ మధ్య ఛార్మీ తన ఫోకస్ మొత్తం ఫిల్మ్ ప్రొడక్షన్‌ మీదే పెట్టింది. గ్లామర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీకి ఆఫర్లు లేకపోవడంతో సొంతంగా పూరీ డైరెక్షన్‌లో 'జ్యోతిలక్ష్మి' నిర్మించింది. ఆ మూవీ సక్సెస్ కాకపోయినా ఛార్మీకి ప్రొడక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. దాంతో.. ప్రస్తుతం బాలయ్యతో పూరీ డైరెక్ట్ చేస్తోన్న 'పైసా వసూల్'కి లైన్‌ ప్రొడ్యూసర్‌గా ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూస్తోంది.
అయితే.. ఇక మీదట యాక్టింగ్‌కి గుడ్‌బై చెప్పేసి, ఫుల్‌టైం ప్రొడక్షన్‌లో యాక్టివ్‌గా వుండాలని డిసైడ్ అయిపోయింట ఛార్మీ. అంతేకాదు.. త్వరలోనే మెగాఫోన్ పట్టే ప్లాన్‌ కూడా చేస్తోందట. అందుకోసం స్టోరీలు రెడీ చేస్తోందని సమాచారం. ఈ విషయంలో పూరీ నుండి కూడా ఫుల్ సపోర్ట్ రావడంతో, ఛార్మీ డైరెక్టర్ కావడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com