టీమిండియా శ్రీలంక పర్యటన ఖరారు, పూర్తి షెడ్యూల్ వివరాలు
- June 20, 2017
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది. ఈ టోర్నీ అనంతరం టీమిండియా వెస్టిండిస్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. జూన్ 23 నుంచి ప్రారంభంకానున్న వెస్టిండిస్ పర్యటన జులై 9తో ముగియనుంది.
వెస్టిండిస్ పర్యటన ముగిసిన తర్వాత 10 రోజుల విరామం అనంతరం టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. జూలై 21, 22న జరిగే వార్మప్ మ్యాచ్‌లతో శ్రీలంక పర్యటన ప్రారంభమవుతుంది. లంక పర్యటనలో టీమిండియా ఆతిథ్య జట్టుతో భారత్ 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది.
దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. జులై 26 నుంచి సెప్టెంబరు 6 మధ్య ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. 2015లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
పూర్తి షెడ్యూల్ వివరాలు:
వార్మప్ మ్యాచ్‌లు: జులై 21, 22 10 AM (IST)
టెస్టులు (10 AM (IST) గంటలకు ప్రారంభం)
మొదటి టెస్టు: జులై 26-30(క్యాండీ)
రెండో టెస్టు: ఆగస్టు 4-8(గాలే)
మూడో టెస్టు: ఆగస్టు 12-16(కొలంబో)
వన్డేలు (2.30 PM (IST) గంటలకు ప్రారంభం)
తొలి వన్డే: ఆగస్టు 20
రెండో వన్డే: ఆగస్టు 24
మూడో వన్డే: ఆగస్టు 27
నాలుగో వన్డే: ఆగస్టు 30
ఐదో వన్డే: సెప్టెంబరు 3
ఏకైక టీ20: సెప్టెంబరు 6 (7 PM (IST) గంటలకు ప్రారంభం)
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







