బ్రెడ్ షాహి
- June 20, 2017
కావలసినవి బ్రెడ్ ప్యాకెట్ ఒకటి, పచ్చి కోవా 150 గ్రా., చక్కెర 600 గ్రా., పాలు ఒక లీటరు, నీళ్లు ఒక లీటరు, కుంకుమపువ్వు ఒక గ్రా., నూనె తగినంత, జీడిపప్పు, కిస్‌మిస్, బాదం పప్పులు, పిస్తా పప్పులు కొద్దిగా.
ఎలా చేయాలి
బ్రెడ్ ముక్కల్ని రెండేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నీళ్లలో చక్కెర, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి వేడి చేయాలి. లేత పాకంలా వచ్చాక కిందికి దించాలి. బాణలిలో నూనెని వేడి చేసి బ్రెడ్ ముక్కల్ని వేగించి వాటిని చక్కెర పాకంలో వేయాలి. తర్వాత మరిగించిన పాలలో పచ్చి కోవాను బాగా కలిపి వెడల్పాటి గిన్నెలో ఆ మిశ్రమాన్ని పోయాలి. పైన బ్రెడ్ ముక్కల్ని పేర్చి మిగిలిన చక్కెర పాకాన్ని కూడా వాటిపై పోయాలి. పప్పులన్నిటిని కట్ చేసి పైన అలంకరించాలి. సన్నని మంట మీద ఈ గిన్నెని పెట్టి చక్కెర పాకం గట్టిపడిన తర్వాత కిందికి దించాలి.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







