యోగాతో ప్రపంచమంతా భారత్‌తో మమేకం: నరేంద్ర మోదీ
- June 20, 2017
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. 'ఆరోగ్యం కోసం యోగా' పేరిట బుధవారం మూడో అంతర్జాతీయ యోగా డేను జరుపుకుంటున్నారు. ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశంలో ఐదు వేళ చోట్ల యోగా డే కార్యక్రమాలు చేపట్టారు. నేటి ఉదయం లక్నోలోని రామాబాయ్ సభాస్థల్‌లో నిర్వహించిన యోగా డే వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. యోగా నిపుణుల పర్యవేక్షణలో వారి సూచనల ప్రకారం వేలాది ఔత్సాహికులతో కలిసి మోదీ, యోగి పలు రకాల యోగాసనాలు వేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మీడియాతో మాట్లాడుతూ.. 'యోగాతో ప్రపంచమంతా భారత్‌తో మమేకమైంది. యోగాతో శారీరక, మానసిక వికాసం సాధ్యం. మూడేళ్లలో అనేక యోగా శిక్షణా సంస్థలు ఆవిర్భవించడం ఆనందదాయకం. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగం చేసుకోవాలని' దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. యోగాలో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయని, ప్రతిరోజు తప్పనిసరిగా యోగి చేయడం ద్వారా అందరూ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







