యూఏఈలో ప్రపంచ యోగా దినోత్సవం: వేలాదిమంది హాజరు
- June 21, 2017
దుబాయ్:ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం పెద్ద సంఖ్యలో యూఏఈ వ్యాప్తంగా యోగాసనాల్లో మునిగి తేలారు. మూడో ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. 2014లో జూన్ 21వ తేదీని ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న చర్యల నేపథ్యంలో యోగాకి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందనడం నిస్సందేహం. 5 వేల సంవత్సరాలకు పూర్వమే యోగా, భారత సంస్కృతీ సంప్రదాయాలు, జీవన శైలిలో భాగమైంది. యోగా అనేది ఓ ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రపంచ దేశాలు గుర్తించాయి. యూఏఈ వ్యాప్తంగా ఈసారి చాలా ప్రాంతాల్లో యోగాసనాల కోసం ఏర్పాట్లు జరిగాయి. దుబాయ్‌లో బుర్జ్ పార్క్, జబీల్ పార్క్, బురమైమీ కాంప్లెక్స్ సహా పలు చోట్ల యోగాసన కార్యక్రమాలు జరిగాయి. ఇండియన్ కాన్సులేట్ జనరల్, స్థానిక స్కూల్స్ మరియు యోగా అసోసియేషన్స్‌తో కలిసి దుబాయ్‌లో యోగా దినోత్సవ వేడుకల్ని నిర్వహించింది.



తాజా వార్తలు
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్







