హైదరాబాద్ లో టీవీ నటి బలి
- June 21, 2017
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య ఉదంతం చల్లారక ముందే టీవీ నటిపై అత్యాచారం జరిగిన వ్యవహారం వెలుగులో రావడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో ఉంటూ టెలివిజన్ రంగంలో ఆర్టిస్టుగా రాణిస్తోన్న ఓ మహిళపై.. అనంతపురానికి చెందిన కీచకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు రాచకొండ పోలీస్ కమిషర్ మహేష్ భగవత్‌కు బుధవారం రాత్రి ఫిర్యాదు అందింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో నివసించే టీవీ ఆర్టిస్టును.. అదే ప్రాంతంలో ఉంటోన్న అనంతపురం వాసి ఒకడు రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసేవాడు. మాట వినకుంటే అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించేవాడు. ఈక్రమంలో నిందితుడు అనంతపురంలోని తన ఇంటికి బాధితురాలిని తీసుకెళ్లి నిర్బంధించాడు. అక్కడ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఎలాగోలా కీచకుడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా హైదరాబాద్ వచ్చి.. తనపై జరిగిన అకృత్యాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఎల్బీ నగర్ పోలీసులు.. అనంతపురంలో నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







