పోలీసుల్ని చంపినవారికి మరణశిక్షే సరి:ఎంపీ

- June 21, 2017 , by Maagulf
పోలీసుల్ని చంపినవారికి మరణశిక్షే సరి:ఎంపీ

మనామా: ఓ పోలీసు వ్యక్తి మృతి చెందడానికీ, పలువురు గాయపడ్డానికీ కారణమైన టెర్రిస్టులకు మరణ శిక్ష విధించడమే సరైన పని అని పేర్కొంటూ, తీవ్రవాదులకు మరణ శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు ఓ పార్లమెంటేరియన్‌. ఎలాంటి ఆలోచనా లేకుండా తీవ్రవాదులకు మరణ శిక్ష విధించడమే మంచిదని సెకెండ్‌ డిప్యూటీ స్పీకర్‌ అబ్దుల్‌హలిమ్‌ మురాద్‌ కోరారు. అల్‌ అస్లా ఇస్లామిక్‌ సొసైటీ హెడ్‌ కూడా అయిన మురాద్‌, తీవ్రవాదులు జరిపిన బాంబు దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో అబ్దుల్‌సమాద్‌ హజి అనే 31 ఏళ్ళ పోలీస్‌ మృతి చెందారు. ఆదివారం దిరాజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఎంపీ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com