సూపర్‌స్టార్‌ తలైవా బర్త్డేకి '2.0' ట్రైలర్

- June 22, 2017 , by Maagulf
సూపర్‌స్టార్‌ తలైవా బర్త్డేకి '2.0' ట్రైలర్

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న '2.0' ట్రైలర్ని చిత్రబృందం తలైవా రజనీకాంత్ పుట్టినరోజు (డిసెంబర్ 12)న విడుదల చేయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా ఈ దీపావళికి విడుదల కావాల్సి ఉంది కానీ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కారణంగా జనవరికి వాయిదా వేశారు. దాంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే అభిమానుల కోసం దీపావళికి టీజర్ ప్రోమోతో పాటు ఫస్ట్లుక్ను, రజనీ పుట్టినరోజున ట్రైలర్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
దుబాయ్లో ఆడియో లాంచ్ . 
2010లో వచ్చిన 'రోబో' చిత్ర ఆడియో లాంచ్ మలేసియాలో నిర్వహించారు. ఇప్పుడు '2.0' చిత్ర ఆడియోను అక్టోబర్లో దుబాయ్లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ ఆడియో లాంచ్ కార్యక్రమానికి భారీగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీకి జోడీగా అమీ జాక్సన్ నటిస్తోంది. ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ అక్షయ్కుమార్ నటిస్తున్నారు.
రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com