800ఏళ్ల నాటి మసీదును పేల్చివేసిన ఐసిస్
- June 22, 2017
ఇరాక్లోని మొసూల్ నగరంలో గల అతి పురాతన చారిత్రక కట్టడం అల్ నూరీ మసీదును ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బుధవారం పేల్చివేశారు. మొసూల్ నగరాన్ని అధీనంలోకి తెచ్చుకునేందుకు గతకొన్ని నెలలుగా ఇస్లామిక్ ఉగ్రవాదులు, ఇరాక్ భద్రతా బలగాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐసిస్ ఉగ్రవాదులు మసీదును పేల్చివేసినట్లు ఇరాక్ బలగాలు చెబుతున్నాయి.
అయితే మసీదును తాము పేల్చలేదని ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. అమెరికా సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లోనే అల్ నూరీ మసీదు ధ్వంసమైందని ఇస్లామిక్ స్టేట్కు చెందిన అమఖ్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. కాగా.. ఐసిస్ ఆరోపణలను అమెరికా తీవ్రంగా ఖండించింది. 'అల్ నూరీ మసీదు ధ్వంసమైంది. అయితే అది సంకీర్ణ దళాల వైమానిక దాడుల వల్ల మాత్రం కాదు. అసలు మేం ఆ ప్రాంతంలో బుధవారం దాడులు చేయలేదు' అని సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి కల్నల్ ర్యాన్ దిల్లాన్ వెల్లడించారు.
ఏదేమైనా.. అతి పురాతన, ఎంతో ప్రాచుర్యం కలిగిన దేశ సంపదను ఇరాక్ కోల్పోయింది. 800 ఏళ్ల కిత్రం నూర్ అల్ దిన్ మహ్మద్ జంగీ ఆదేశాల మేరకు ఈ మసీదును నిర్మించారు. అప్పటి నుంచి ఈ మసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ మసీదులోని అతి ఎత్తైన స్తంభం లెర్నింగ్ మినరేట్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. అంతేగాక.. ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబు బకర్ అల్ బాగ్దాది.. మూడేళ్ల క్రితం ఈ మసీదులోనే తనకు తాను కలీఫాగా ప్రకటించుకున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







