నాస్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో యోగ నిర్వహణ
- June 22, 2017
నాస్ కార్పోరేషన్ భారతీయ రాయబార కార్యాలయం సహకారంతో మినా సల్మాన్ హెడ్ క్వార్టర్స్‌లో వద్ద సోమవారం యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించారు..ఈ సందర్భంగా నాస్ కార్పరేషన్ చైర్మన్ సమీర్ ఎ. భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హాను ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతించారు. నాస్ గ్రూప్ డైరెక్టర్ హేమంత్ జోషి యోగ కార్యక్రమమును ప్రారంభించటానికి వచ్చిన భారత రాయబారి మరియు ఇండియన్ ఎంబసీ సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "యోగా ఒక ప్రాచీన అభ్యాస ప్రక్రియ అని ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వ్యక్తులకు సంపూర్ణ శ్రేయస్సు సాధించడానికి సహాయం చేస్తున్న విధానమని అన్నారు. అలాగే ,యోగా ఆరోగ్యానికి అనుకూలమైన ప్రయోజనాలకు అదనంగా, మానసిక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందన్నారు.అనంతరం ప్రసంగించిన భారత రాయబారి ,యోగ యొక్క అపారమైన లాభాలను వివరించారు. యోగ ప్రయోజనాలను పలువురికి వివరించి యోగాను ప్రోత్సహించాలని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 120 కంటే ఎక్కువ మంది హాజరెయ్యారు. ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఈ కార్యక్రమం ఘన విజయం సాధించింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







