నాస్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో యోగ నిర్వహణ

- June 22, 2017 , by Maagulf
నాస్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో యోగ నిర్వహణ

 నాస్ కార్పోరేషన్  భారతీయ రాయబార కార్యాలయం సహకారంతో మినా సల్మాన్ హెడ్ క్వార్టర్స్లో వద్ద సోమవారం యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించారు..ఈ సందర్భంగా నాస్ కార్పరేషన్ చైర్మన్ సమీర్ ఎ. భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హాను ఈ కార్యక్రమానికి సాదరంగా  స్వాగతించారు. నాస్ గ్రూప్ డైరెక్టర్ హేమంత్ జోషి యోగ కార్యక్రమమును  ప్రారంభించటానికి  వచ్చిన భారత రాయబారి మరియు ఇండియన్ ఎంబసీ సిబ్బంది  కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "యోగా ఒక ప్రాచీన అభ్యాస ప్రక్రియ అని  ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వ్యక్తులకు సంపూర్ణ శ్రేయస్సు సాధించడానికి సహాయం చేస్తున్న విధానమని అన్నారు. అలాగే ,యోగా ఆరోగ్యానికి అనుకూలమైన ప్రయోజనాలకు అదనంగా, మానసిక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందన్నారు.అనంతరం ప్రసంగించిన భారత రాయబారి ,యోగ యొక్క అపారమైన లాభాలను వివరించారు. యోగ ప్రయోజనాలను పలువురికి వివరించి యోగాను  ప్రోత్సహించాలని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 120 కంటే ఎక్కువ మంది హాజరెయ్యారు. ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో  ఈ కార్యక్రమం  ఘన విజయం సాధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com