దోహాకు భారత్ అదనపు విమానాలు
- June 22, 2017
పవిత్ర రంజాన్ పర్వదినం నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దోహాకు తాత్కాలికంగా అదనపు విమానాలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఇలా అదనపు సర్వీసులు నడపాల్సిందిగా ఎయిరిండియా, జెట్ ఎయిర్వేస్ను ప్రభుత్వం కోరింది.
కొన్ని మధ్యప్రాచ్య దేశాలు ఖతార్ విమానాలపై నిషేధం విధించిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ జూన్ 22, 23 తేదీల్లో ముంబై-దోహాల మధ్య 168 సీట్ల విమానాలు నడుపుతుంది.
ఎయిరిండియా అనుబంధ సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ జూన్ 25 నుంచీ జులై 8వ తేదీ వరకూ తిరువనంతపురం-దోహా, కొచ్చిన్-దోహాల మధ్య 186 సీట్ల విమానాలను నడుపుతుందని పౌరవిమానయానశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ అదనపు విమానాల అవసరంపై ఇటీవల పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతి రాజుతో చర్చించిన నేపథ్యంలో ఈ అదనపు విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం







