యూఏఈలో వాట్సాప్ కాల్స్ - అనుమతి లేదు
- June 22, 2017
యు.ఏ.ఈ: ప్రపంచ వ్యాప్తంగా 'వాట్సాప్' మేనియాలో మునిగి తేలుతోంది. ఫ్రీ కాలింగ్ సర్వీస్‌ని సైతం వాట్సాప్ అందిస్తోంది. అయితే యూఏఈలో వాట్సాప్ కాలింగ్‌పై నిషేధం ఉంది. గురువారం ఉదయం యూఏఈ నివాసితులు వాట్సాప్ కాలింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్న ఆనందాన్ని వ్యక్తం చేసేంతలోపే, అధికార వర్గాలు అలాంటి వెసులుబాటు ఏమీ కల్పించలేదని స్పష్టం చేయడంతో వారంతా ఉస్సూరుమన్నారు. ఈ తరహా కాలింగ్ సౌకర్యం ఎవరు అందించినా, అది నిబంధనలకు విరుద్ధమే అవుతుందని టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ పేర్కొంది. సోషల్ మీడియాలో 'వాట్సాప్ కాలింగ్ అన్ బ్లాక్డ్' అని ప్రచారం జరుగుతుండగా, దాన్ని అధికారిక వర్గాలు ఖండించాయి. భారతీయ వలసదారుడొకరు, అనుకోకుండా వాట్సాప్‌లో 'కాల్ బటన్'ని ప్రెస్ చేస్తే, ఆ వెంటనే అవతలి ఫోన్ రింగ్ అయ్యిందని చెప్పారు. దేశానికి దూరంగా ఉంటున్న తమకు, స్వదేశంలోని తమవారితో మాట్లాడేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పలువురు వలసదారులు పేర్కొంటున్నారు. ఈ ఆప్షన్ లేకపోవడంతో తాము చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని వారు చెప్పారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







