హజ్‌యాత్ర పూర్తి చేసుకుని స్వరాష్ర్టానికి చేరుకుంటున్న యాత్రికులు
- October 14, 2015
హజ్‌యాత్ర పూర్తి చేసుకుని బుధవారం నుంచి స్వరాష్ర్టానికి చేరుకుంటున్న హజ్‌యాత్రికులకు అసౌకర్యం కలుగకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్టు హజ్ టెర్మినల్‌లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన రెండు ప్రత్యేక విమానాల్లో బుధవారం 680 మంది యాత్రికులు సౌదీ అరేబియాలోని మదీనా నుంచి హైదరాబాద్‌కు ఉదయం 8.40కి, రాత్రి 10.20కి చేరుకోనున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికారులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హజ్ తొలి బృందానికి స్వాగతం పలకనున్నారు. ఈ నెల 20 వరకు మొత్తం 16 ప్రత్యేక విమానాల్లో రాష్ట్ర యాత్రికులు హైదరాబాద్ చేరుకుంటారు. హజ్‌టెర్మినల్‌లో వీరికి ఇబ్బందులు కలుగకుండా, లగేజిని త్వరగా చెకింగ్ చేసి అప్పగించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. తెలంగాణ హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్‌ఏ షుకూర్, ఎయిర్ ఇండియా, కస్టమ్స్, ఇమిగ్రేషన్ అధికారులతో ఎయిర్‌పోర్టు హజ్ టెర్మినల్‌ను సందర్శించి ఏర్పాట్లు సమీక్షించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







