షార్జాలో మహిళ మృతిపై విచారణ ప్రారంభం

- June 23, 2017 , by Maagulf
షార్జాలో మహిళ మృతిపై విచారణ ప్రారంభం

షార్జా: షార్జా పోలీసులు, అల్‌ గఫ్యా ప్రాంతంలోని ఓ ఇంట్లో మృతి చెందిన 26 ఏళ్ళ మహిళకు సంబంధించిన కేసు విచారణ ప్రారంభించారు. షార్జా పోలీస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ, బుధవారం ఉదయం 5 గంటల సమయంలో ఫోన్‌ కాల్‌ వచ్చిందనీ, మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లుగా తెలియజేశారని చెప్పారు. మృతురాల్ని అచేతనావస్థలో కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెను ఉదయం 5.35 నిమిషాల సమయంలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆమె మృతి చెందినట్లుగా ప్రకటించడం జరిగింది. క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ టీమ్‌, ఈ కేసు విచారణ చేపట్టింది. అటాప్సీ కోసం ఫోరెన్సిక్‌ ల్యాబరేటరీకి మృతదేహాన్ని తరలించారు. ఆమెది హత్యా? లేదంటే ఆత్మహత్యకు పాల్పడిందా? అనే విషయం తేలాల్సి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com