సునీల్‌ నారంగ్‌కి ఎదురే లేదు

- June 23, 2017 , by Maagulf
సునీల్‌ నారంగ్‌కి ఎదురే లేదు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌ ఎన్నికలు తెలుగు సినీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఫిలిం ఛాంబర్‌ ఎన్నికలు సర్వసాధారణ విషయమే అయినప్పటికీ ఈ ఏడాది ఎన్నికలు ప్రత్యేక ఆకర్షణగా మారడానికి కారణం బరిలో నిలిచిన ప్రముఖులే. ఇందులో ఒకరు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌, ఏసియన్‌ ఫిలింస్‌ అధినేత సునీల్‌ నారంగ్‌ కాగా, మరొకరు ఎగ్జిబిటర్‌ విజయేందర్‌రెడ్డి. మెజార్టీ ఓట్లు సునీల్‌ నారంగ్‌ వైపుకు మళ్ళుతాయని సినీ పరిశ్రమలో అందరూ అనుకోవడానికి కారణం, సినీ పరిశ్రమతో ఆయనకున్న సత్సంబంధాలు, వ్యక్తిగా మంచి గుర్తింపు అని సినీ ప్రముఖులంటున్నారు. చిన్న సినిమాల డిస్ట్రిబ్యూటర్‌గా సినీ రంగంలోకి వచ్చి, 'బాహుబలి-2' లాంటి సినిమాల్ని డిస్ట్రిబ్యూట్‌ చేసే స్థాయికి ఎదిగారాయన. అలాగే పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు, ఎన్టీయార్‌ తదితర స్టార్‌ హీరోలు నటిస్తున్న సినిమాల్ని ఆయన డిస్ట్రిబ్యూట్‌ చేయనున్నారు. అలాగే ఏసియన్‌ మల్టిప్లెక్సెస్‌ డైరెక్టర్‌గా కూడా సునీల్‌ నారంగ్‌కి మంచి పేరున్న దరిమిలా ఆయన విజయం లాంఛనమే అనుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com