వైవిధ్యంగా 'రాగ్‌దేశ్‌' చిత్రం ట్రైలర్ విడుదల

- June 23, 2017 , by Maagulf
వైవిధ్యంగా 'రాగ్‌దేశ్‌' చిత్రం ట్రైలర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్‌ను పార్లమెంట్‌లో విడుదల కానుంది. బాలీవుడ్‌ దర్శకుడు తిగ్మాంషు ధులియా తెరకెక్కిస్తున్న చిత్రం 'రాగ్‌దేశ్‌'. కునాల్‌ కపూర్‌, అమిత్‌ సాధ్‌, మోహిత్‌ మార్వా ప్రాధన పాత్రదారులు. ఈ చిత్ర ట్రైలర్‌ను పార్లమెంట్‌లో విడుదల చేయనున్నారు.
'దేశ స్వాతంత్య్ర పోరాటంలో ముగ్గురు ఐఎన్‌ఎస్‌ అధికారులు ఏం చేశారు అన్న నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించాం. ఈ చిత్ర ట్రైలర్‌ను పార్లమెంట్‌లో విడుదల చేయబోతున్నాం. పార్లమెంట్‌ ఇలాంటి అవకాశం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇది మా సినిమాకు ఎంతో గౌరవం' అని చిత్ర దర్శకుడు తిగ్మాంషు ధులియా వెల్లడించారు. జులై 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com