ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్: షేక్ మొహమ్మద్ ఆదేశం
- June 23, 2017
దుబాయ్:ఇయర్ ఆఫ్ గివింగ్ నేపథ్యంలో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్రాఫిక్ మరియు ఇంపౌండ్‌మెంట్ జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్ ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈద్ అల్ ఫితర్ ముందు రూలర్ ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా ట్విట్టర్ ద్వారా దుబాయ్ మీడియా ఆఫీస్ వెల్లడించింది. 2016 జులై 1 నుంచి 2016 డిసెంబర్ 31 వరకు నమోదైన జరీమానాలకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. 2017 జనవరి నుంచి నమోదైన జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తించదు. వాహనదారులు తమ జరీమానాల్ని పోలీస్ స్టేషన్లు, దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, వెహికిల్ రిజిస్ట్రేషన్ సెంటర్స్, ఫైన్ పేమెంట్ మెసీన్స్ వంటి వాటి ద్వారా చెల్లించడానికి వీలుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







