షరతులు న్యాయబద్ధవైనవి అమలుచేయదగనివి
- June 24, 2017
సౌదీ అరేబియా : గల్ఫ్ దేశాల్లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు పలు అరబ్బు దేశాలు ముందుకొచ్చాయి. అరబ్బు దేశాల్లో ఒంటరిగా మారిన ఖతర్‌కు దౌత్యసంబంధాలను కొనసాగించేందుకు ఆంక్షలు విధించిన దేశాలు ఓ అవకాశాన్ని ఇచ్చాయి. 13 నిబంధనలతో కూడిన ఓ లేఖకు విడుదల చేశాయి. 10 రోజుల గడువులోగా లేఖలో పేర్కొన్న షరత్తులకు ఖతర్ ఒప్పుకుంటే బంధాలు పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయా దేశాలు పేర్కొన్నాయి. షరతులలో ముఖ్యమైనవి.. ఇరాన్‌తో ఖతర్ దౌత్యసంబంధాలను తెంచుకోవాలని, ఖతర్‌లోని టర్కీ మిలిటరీ క్యాంపును వెంటనే తొలగించాలనేవి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. అల్-ఖైదా, ఐసిస్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలకు ఖతర్ సహకారం అందించకూడదని, ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు 13 డిమాండ్లతో కూడిన లేఖను మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న కువైట్.. ఖతర్‌కు అందించింది. 10 రోజుల గడువులోగా షరత్తులకు ఒప్పుకుంటే దౌత్యబంధాలను పునరుద్ధరిస్తామని, లేని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని సౌదీఅరేబియా, ఈజిప్ట్, యూఏఈ, బహ్రైన్ దేశాలు ఈ లేఖలో పేర్కొన్నాయి. ఇదిలావుండగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న సంస్థలకు అండగా నిలుస్తున్న ఖతర్‌తో కొద్దిరోజుల క్రితం పలు అరబ్బు దేశాలు దౌత్యసంబంధాలను తెంచుకున్నాయి. కఠినమైన ఆంక్షలు విధించాయి. దీంతో ఖతర్ ఒంటరిగా మారిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







