'రెండు రెళ్ళు ఆరు' పాటలు విడుదల
- June 24, 2017
హాస్యబ్రహ్మ జంధ్యాల తెరకెక్కించిన 'రెండు రెళ్ళు ఆరు' సినిమా విడుదలై చూస్తుండగానే మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడు అదే పేరుతో ఓ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వారాహి చలన చిత్ర పతాకంపై భారీ చిత్రాలతో పాటు బడ్జెట్ మూవీస్నూ సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అంతేకాదు... వేరే వారు నిర్మించిన సినిమా తన మనసుకు నచ్చితే దానిని విడుదల చేయడానికీ ఆయన సిద్ధమౌతుంటారు. తాజాగా ప్రదీప్ చంద్ర, మోహన్ సంయుక్తంగా నిర్మించిన 'రెండు రెళ్ళు ఆరు' అనే చిత్రానికి సాయి కొర్రపాటి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. నందు మల్లెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనిల్, మహిమ జంటగా నటించారు. విజయ్బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ ఇటీవల జరిగింది. రాజమౌళి తొలి సీడీ ఆవిష్కరించి కీరవాణికి అందించారు.
'రెండు రెళ్ళు ఆరు' చిత్రాన్ని రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు నందు మల్లెల తెరకెక్కించారు. పాటలకు చక్కని స్వరాలు అందించే అవకాశం తనకు లభించిందని, జీవన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారని సంగీత దర్శకుడు విజయ్ చెప్పారు. హృదయానికి హత్తుకునేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. తన గురువు జంధ్యాల రూపొందించిన 'రెండు రెళ్ళు ఆరు' సినిమా పేరుతో ఇంతకాలానికి మరో సినిమా రావడం పట్ల సీనియర్ నటుడు నరేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే నెల 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







