వాహనాల క్రాష్ హిస్టరీని చెప్పేస్తుంది
- October 14, 2015
సెకెండ్ హ్యాండ్ వాహనాల్ని కొనుగోలు చేయడం ద్వారా అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వినియోగదారులకి. ఆ వాహనం యొక్క గత చరిత్రను తెలుసుకోవడం వాహనదారులకు కష్టమైన విషయం. ఆ సమస్యలనుంచి వాహనదారులను గట్టెక్కించేందుకు ఓ వెబ్సైట్ రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్, రాయల్ ఒమన్ పోలీస్ మరియు ఇన్స్యూరెన్స్ కంపెనీలు సంయుక్తంగా రూపొందిస్తున్న కార్యాచరణలో ఈ వెబ్సైట్ కూడా భాగం. ఈ వెబ్సైట్లో వాహనాల క్రాష్ హిస్టరీని చూసి, వాహనాన్ని కొనాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి వీలవుతుంది. ఇది చాలా మంచి నిర్ణయమని సెకెండ్ హ్యాండ్ వెహికిల్ కొనాలనుకుంటున్న ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. వాడిన కార్లను అమ్మే సంస్థ యజమాని జసిమ్ అల్ హర్తి చెబుతూ, పబ్లిక్కి ఈ వెబ్సైట్ ద్వారా ఎంతో ఉపయోగముంటుందని అన్నారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







