గ్యాస్ సిలిండర్ ను పేల్చిన ముగ్గురు నిందితులకు మూడేళ్ళ జైలుశిక్ష
- June 25, 2017
సిట్రలో గ్యాస్ సిలిండర్ ను ఉద్దేశ్యపూర్వకంగా పేల్చివేసినందుకు ముగ్గురు నిందితులకు మూడు సంవత్సరాల జైలుశిక్ష హైకోర్టు విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27 వ తేదీన ఈ సంఘటన జరిగింది, అక్కడ ప్రతివాదులు తగలబడుతున్న టైర్ల మధ్యలో ఒక గ్యాస్ సిలిండర్ ను ఉంచి తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్దంతో సిలిండర్ బాంబు మాదిరిగా పేలిపోయింది. పోలీసు దర్యాప్తు తరువాత ఆ ఘటనకు కారకులైన నిందితులు పట్టుబడ్డారు. సిలెండర్ ను పేల్చివేద్దామని రెండవ నిందితుడు మొదటి నిందితుడు తనను ఒప్పించాడని ప్రాసిక్యూషన్ ఎదుట ఆరోపించాడు. అంతేకాక, తానూ ఒక భారీ విస్ఫోటనం ఈ ప్రాంతంలో కోరుకుంటున్నానని ఇందుకు తన వద్ద ఒక గ్యాస్ సిలిండర్ ఉందని నాకు చెప్పాడని. దానికి నన్ను అంగీకరించమని వత్తిడి తెచ్చాడు. దేనితో మేము మూడవ నిందితుడిని కలుసుకున్నాము. ఉదయం 11:00 గంటలకు (ఫిబ్రవరి 27, 2017) మేము సిలిండర్ ను టైర్లు మధ్యలో ఉంచి..అది పేలెందుకు ఫైర్ బాంబులు ఊపయోగించి విస్ఫోటనం జరిగేలా చేసేమని ఆ ముగ్గురు నిందితులు కోర్టు ఎదుట తమ తప్పును ఒప్పుకొన్నారు. ఈ ముగ్గురు టెర్రరిస్టు ప్రయోజనాల కోసం సిలిండర్ ను వారు పేల్చడం జరిగిందని ఆ నిందితులపై అభియోగాలు మోపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







