భారత్‌కు అమెరికా మానవరహిత డ్రోన్లు
- June 25, 2017
భారత్‌కు అమెరికా మానవరహిత డ్రోన్లు రాబోతున్నాయి. రెండు వందల కోట్ల డాలర్ల ఈ రక్షణ ఒప్పందానికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాని ప్రకారం 22 గస్తీ డ్రోన్లు భారత నావికాదళాంలో చేరతాయి. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో అమెరికా ఈ డీల్‌కు ఓకే చెప్పటం ప్రాధాన్యత సంతరించుకుంది.
డేగల్లాంటి డ్రోన్లు త్వరలో ఇండియన్ నేవీలో చేరతాయి. ఇండియాకు వీటిని విక్రయించటానికి అమెరికాకు ఎన్నో భయాలున్నాయి. ఓ పక్క భారత్-పాక్ మధ్య కశ్మీర్ ఉద్రిక్తతలు..ఇంకో పక్క చైనా.
కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియాను దారికి తేవాలంటే చైనాతో స్నేహం అమెరికాకు చాలా అవసరం. భారత్‌కు రక్షణ సాయం అంటే సహజంగానే చైనా, పాక్‌కు గిట్టదు. ఐనా ట్రంప్ సర్కార్ భారత్‌కు ప్రిడేటర్‌ను ఇవ్వటానికి ముందుకొచ్చింది.
ఈ హైటెక్ డ్రోన్లను భారత్‌కు విక్రయించేందుకు ట్రంప్ సర్కార్ ఎంతో తర్జన భర్జన పడింది. ఐతే, భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు ట్రంప్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మోడీ పర్యటనకు సానుకూల స్పందనగా అమెరికా ఈ డీల్‌కు ఓకే చెప్పినట్టు విశ్లేషకులు బావిస్తున్నారు. ఈ నెల 26న శ్వేతసౌధంలో ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కీలకం కానుంది.
నిజానికి బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అమెరికా నుంచి 22 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు ముందడుగు పడింది. ఐతే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. భారత్ మాత్రం అమెరికాను ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేసింది. మోడీ పర్యటన నేఫథ్యంలో అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ఈ అగ్రిమెంట్ కు ఓకే చెప్పటం శుభపరిణామమని భారత్ వ్యాఖ్యనించింది.
తీరప్రాంత నిఘాకు ముఖ్యంగా హిందూ మహా సముద్ర ప్రాంత రక్షణ కోసం ఈ డ్రోన్లు కొనుగోలు చేస్తోంది. 7 వేల 5 వందల కిలోమీటర్ల సాగరతీరం కలిగిన భారత్‌కు వీటి అవసరం చాలా ఉంది. ప్రాంతీయ సముద్ర జలాల్లో చైనా జలంతర్గాముల చొచ్చుకొస్తున్న దృష్ట్యా వీటి కొనుగోలు భారత్‌కు తప్పనిసరి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ తరహా డ్రోన్లను కొనుగోలు చేసిన నాటో కూటమిలో భాగస్వామ్యం లేని దేశంగా భారత్ నిలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







