రేపే భారత్ దేశంలో ఈద్ ఉల్ ఫితర్
- June 25, 2017
ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్ పర్వదినాన్ని రేపు జరుపుకోనున్నారు. ఆదివారం సాయంత్రం షవ్వాల్ నెలవంక కనిపించడంతో ఈద్ ఉల్ ఫితర్ను సోమవారం జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. గత నెలరోజులుగా ముస్లింలు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు పాటిస్తున్న సంగతి తెలిసిందే. రంజాన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యం, సర్వమత సౌభ్రాతృత్వానికి నెలవైన రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంతో గంగా జమున తెహజీబ్ సంస్కృతి ప్రతిబింబించేలా పండగ జరుపుకోవాలని ఆయన ఆకాక్షించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి తీసుకువచ్చిన శుభసమయాన్ని ముస్లింలు పండుగలా నిర్వహించుకోవటం సంతోషమన్నారు. సత్ప్రవర్తన ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని మహ్మద్ ప్రవక్త చెప్పిన మాటలు సదా అనుసరణీయమని సీఎం అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







