సౌదీ అరేబియాలో ముగిసిన క్షమాభిక్ష గడువు
- June 25, 2017
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న వారికి అక్కడి ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్ష గడువు నిన్నటితో ముగిసింది. ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. తెలంగాణకు చెందిన మూడు వేల మంది క్షమా భిక్షకు దరఖాస్తు చేసుకోగా ..మరో మూడు వేల మంది అక్కడే తలదాచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారు అక్కడ ఉండలేరు..ఇండియాకు రాలేరు. ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నవారిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడతారు.రెండేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష సౌదీ రియాల్స్ జరిమానా విధించే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోని తెలంగాణ కార్మికులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వీరికి ఆశ్రయం ఇచ్చేవారే కరువయ్యారు. సౌదీలో వేతనాలు ఎక్కువగా ఉంటాయన్న భావనతో తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఉపాధి వెతుక్కుంటూ సౌదీ వెళుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







