కొలంబియాలో బోట్ మునిగి 9మంది మృతి
- June 25, 2017
కొలంబియా: కొలంబియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ టూరిస్ట్ బోట్ మునిగి తొమ్మిది మంది మృతి చెందగా, మరో 30మందికి పైగా గల్లంతు అయ్యారు. బోట్‌లో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. బ్రిటిష్ కొలంబియా తీరంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. అక్కడ ఉన్న చిన్న బోట్లు మరో పెద్ద బోటు త్వరితగతిన ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని 100మందికి పైగా సురక్షితంగా రక్షించారు. దాదాపు 20 మందికి పైగా బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
మెడెల్లిన్ కు 45 కిలోమీటర్ల దూరంలో తూర్పుగా ఉన్న గుటాపె సమీపంలోని కోస్తా తీరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెస్క్యూ టీమ్‌తో పాటు, కొలంబియన్ వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను చేపట్టి బాధితులను అక్కడ నుంచి తరలిస్తున్నారు. అయితే బోట్‌లో ఎలాంటి లైఫ్ జాకెట్లు లేవని, బోటు ఐదు నిమిషాల వ్యవధిలోనే మునిగిపోయిందని ప్రాణాలతో బయటపడ్డ ఓ టూరిస్ట్ తెలిపాడు. కాగా ప్రమాదానికి ముందు బోట్ ఒక భాగం నీటిలో మునిగిపోయినట్లు సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







