నవీన్ చంద్ర, నివేదా జంటగా 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్'

- June 26, 2017 , by Maagulf
నవీన్ చంద్ర, నివేదా జంటగా 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్'

నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా నటిస్తున్న చిత్రం 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్'. అజయ్ వోధిరాల దర్శకుడు. అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై కొత్తపల్లి ఆర్. రఘుబాబు, కె.బి. చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రేమకథాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'అజయ్ వోధిరాల చెప్పిన కథ నచ్చి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. చిత్రీకరణ చివరి దశలో ఉంది. పోస్ట ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. మా చిత్ర దర్శకుడు 'ఆర్య' మొదలుకొని '100% లవ్'వరకు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయడం విశేషం. ఆ స్నేహబంధంతో సుకుమార్ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. త్వరలోనే ట్రైలర్, ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com