తెలంగాణ యువతి సింధుజా రెడ్డి..యూఎస్‌లో ఖ్యాతి
- June 27, 2017
ఆట పట్ల మక్కువ.. అవకాశాలను అందిపుచ్చుకునే నేర్పు ఉంటే ఎక్కడైనా రాణించవచ్చని ని రూపించిన తెలంగాణ అమ్మాయి సల్గుతి సింధుజా రెడ్డి అమెరికా జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఆగస్టులో స్కాట్లండ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలోనూ అమెరికా సత్తా చూపితే తాను 2020లో జరిగే టీ20 ప్రపం చకప్‌లోనూ ఆడగలనన్న ఆశాభావం సింధుజారెడ్డి వ్యక్తంజేసింది. నల్గొండ జిల్లా ఆమన్‌గల్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల సింధుజారెడ్డి హైదరాబాద్‌లో ప్రాథమిక విద్యతోపాటు, బీటెక్ చదివింది. 12 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించిన ఆమె.. 14 ఏళ్లపాటు హైదరాబాద్ అండర్-16, అండర్-19 జట్లకు కీపర్, ఓపెనింగ్ బ్యాట్స్‌ఉమన్‌గా ప్రాతినిధ్యం వహించింది. 2008లో అండర్-19 జాతీయ జట్టుకు ఆడింది. తొలుత విజయ్‌కుమార్ వద్ద ఆపై భారత జట్టు మాజీ కెప్టెన్ పూర్ణిమారావు వద్ద శిక్షణ పొందింది. వివాహం అనంతరం అమెరికా వెళ్లిపోయిన ఆమె కొద్దికాలం తర్వాత మళ్లీ క్రికెట్ బ్యాట్ చేతపట్టింది.
లోకల్ క్లబ్ మ్యాచ్‌ల్లో సత్తా చూపి జాతీయ జట్టు సెలెక్షన్ ట్రయల్స్‌కు ఎంపికైంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







