ప్రధాని అమెరికా పర్యటనలో చర్చకు రాని హెచ్-1బీ వీసా
- June 27, 2017
భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపే ప్రధాన అంశాల్లో హెచ్-1బీ వీసా ఒకటి. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ట్రంప్‌తో భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వస్తుందని అందరూ భావించారు. అయితే, ఆ అంశం ఏదీ చర్చకు రాకపోవడం గమనార్హం. శ్వేత సౌధానికి అధిపతి ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో వీసా భయం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం చర్చకు వస్తుందని అందరూ భావించారు.
ఈ చర్చల్లో హెచ్-1బీ వీసాకు సంబంధించిన అంశమేదీ చర్చకు రాలేదని విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్ మీడియాకు వెల్లడించారు. డిజిటల్ భాగస్వామ్యం అంశం గురించి ఇరు దేశాధినేతల మధ్య చర్చ జరిగిందని చెప్పారు. ట్రంప్, మోదీ భేటీ అనంతరం ఇరు దేశాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలోనూ హెచ్-1బీ వీసా అంశం గురించి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







