విశాఖపట్నంలో ఘనంగా ముగిసిన `జయదేవ్` ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుక ఫంక్షన్

- June 29, 2017 , by Maagulf
విశాఖపట్నంలో ఘనంగా ముగిసిన `జయదేవ్` ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుక ఫంక్షన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ భారీ స్థాయిలో నిర్మించిన చిత్రం 'జయదేవ్‌`. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన ఆడియో ఇటీవల విడుదలై పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విశాఖపట్టణం లో భారీ ఎత్తున నేడు ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుక ఫంక్షన్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేశారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, ` గంటా శ్రీనివాసరావు గారు మాకుటుంబానికి చాలా క్లోజ్. వ్యక్తిగతంగా, రాజకీయపరంగా మాకు బాగా దగ్గరనై వ్యక్తి. ఆయన అంటే చిరంజీవిగారికి చాలా ఇష్టం. ఆ ఇష్టమే నాకు ఆయనపై ఇష్టాన్ని పెంచింది. ఆయన నాకు..మానాన్నగారికి మధ్య ఎజ్ లో ఉంటారు కాబట్టి.. శ్రీనివాస్ గారు నాకు స్నేహితులే. ఆయన కోసం ఇక్కడకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. జయదేవ్ టీమ్ అందరికీ ఆల్ దబెస్ట్. రవి సినిమా కెరీర్ బాగుండాలి. అలాగే జయంత్ గారు మంచి ఫిలిం మేకర్. సినిమా సక్సెస్ అయి అందరికీ మంచి పేరు రావాలి` అని అన్నారు.
హీరో రవి మాట్లాడుతూ, ` నన్ను ఎంకరేజ్ చేసిన తల్లిందండ్రులకు కృతజ్ఞతలు. బన్ని బిజీ షెడ్యూల్ ను పక్కన బెట్టి మాకోసం ఇక్కడికి వచ్చారు. డైరెక్టర్ జయంత్ గారు నాతో సినిమా చేస్తారా? లేదా అని భయపడ్డా. కానీ ఆయన అంగీకరించి నాతో సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. పరుచూరి బ్రదర్స్ మంచి కథ కుదిరింది. మణిశర్మచక్కని సంగీతం అందించారు` అని అన్నారు.
దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ` గంటా శ్రీనివాసరావు గారికి అన్నింటా జయమే. అలాగే రవికి జయమే జరుగుతుంది. టైటిల్ లో.డైరెక్టర్ పేరు లోను జయం ఉంది. ఇంతకన్నా ఇంకేకావాలి సినిమా సక్సెస్ కావడానికి` అని అన్నారు.
చిత్ర దర్శకుడు జయంత్ సి. పరాన్జీ మాట్లాడుతూ, ` రవి ని నా చేతుల మీదుగా లాంచ్ చేసే అవకాశం ఇచ్చినందుకు రవి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. రవి చాలా బాగా నటించాడు. తెలుగు ప్రేక్షకులంతా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ, ` రవి అద్భుతంగా నటించాడు. కథే సినిమాను నడిపిస్తుంది. నాకు-జయంత్ కు హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ఇటీవల మార్కెట్ లోకి విడుదలైన పాటలు పెద్ద సక్సెస్ అయ్యాయి. సినిమా ఆ రేంజ్ ను మించిపోయి హిట్ అవుతుంది` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు దంపతులు, పరుచూరి వెంకటేశ్వరరావు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, మెగా అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com