తెలంగాణ ప్రజా సమితి నూతన కార్యవర్గ ఏర్పాటు మరియు ఇఫ్తార్
- June 29, 2017

దోహ, కతర్: పవిత్ర రంజాన్ నెలను పురస్కరించుకొని , తెలంగాణ ప్రజా సమితి , కతర్ జూన్ 22, 2017 న హైదరాబాద్ ప్యాలెస్ హోటల్లో వార్షిక ఇఫ్తార్ నిర్వహించింది. ఈ కార్యక్రమనికి ఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి మిలన్ అరుణ్ గారు, ఐసిసి మెంబర్‌షిప్ చైర్మన్ శ్రీ ప్రసాద్ రావు కొడూరి గారు అతిధులుగా హాజరయ్యారు.
అతిథులు సమావేశానికి తమ ప్రత్యేకమైన రంజాన్ సందేశాన్ని తెలియజేశారు మరియు సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల కోసం తెలంగాణ ప్రజా సమితి , కతర్ చేస్‌తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఎన్నికైన నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిచయ కార్యక్రమం జరిగింది. అధ్యక్షులు శ్రీ శ్రీధర్ అబ్బగౌని, వైస్ ప్రెసిడెంట్ శ్రీ భానుప్రకాష్ పెద్దపల్లి, జనరల్ సెక్రటరీ శ్రీ కె. రాజేశ్వర్ రావు, శ్రీ అంజయ్య వాట్టంల జె.టి. జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ శ్రీ శ్రీనివాస్ కొత్తపల్లి ల తో పాటు అన్ని ఇతర కార్యనిర్వాహక కమిటీ బృందాలను పరిచయం చేసారు. అనంతరం కొత్త కమిటీ తమ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసింది.
ఈ సంధర్భంగా అతిథులకు ప్రత్యేక హైదరాబాద్ వంటకాల తో విందు ను ఏర్‌పాటు చేయడం జరిగింది.


తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







