ఎయిర్ ఇండియా పై కన్నేసిన ఇండిగో
- June 29, 2017
ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ రంగంలోని బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ 'ఇండిగో' ఆసక్తి చూపిస్తోంది. కంపెనీ నుంచి ఈ మేరకు ప్రతిపాదన అందినట్టు కేంద్ర పౌర విమానయన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకోసం ఇండిగో సంస్థ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ నుంచి లేఖ అందినట్టు పేర్కొంది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన వెంటనే ఇండిగో ఇందుకు ముందుకు రావడం విశేషం. అయితే ఎయిర్ ఇండియా మొత్తాన్నిగాక ఆ సంస్థ అంతర్జాతీయ ఆపరేషన్లపై మాత్రమే ఇండిగో ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటి వరకు టాటా గ్రూపు మాత్రమే ఎయిర్ ఇండియాపై ఆసక్తితో ఉన్నట్టు భావించారు. ఇపుడు ఇండిగో కూడా రంగంలోకి దిగడంతో పోటీ బాగానే ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఎయిర్ ఇండియాకు ఉన్న రూ.52,000 కోట్ల అప్పుల పరిష్కారం ఎలా అనే దానిపైనే డీల్ ఆధారపడి ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
అంత సాహసం నాకు లేదు : మహీంద్రా
ఎయిరిండియాలో ఇన్వెస్ట్ చేసేంత సాహసం తమకు లేదని మహీంద్రా గ్రూప్ సారథి ఆనంద్ మహీంద్రా అన్నారు. ''సాధారణంగా నన్ను నేను సాహసవంతుడుగానే భావిస్తాను. కాని ఎయిరిండియాలో ఇన్వెస్ట్ చేసేంత సాహసం మాత్రం నాకు లేదు'' అని ఆయన ఒక ట్విట్టర్ సందేంలో స్పష్టం చేశారు. వ్యాపార దిగ్గజాల్లో ఒకటి కావడం వల్ల మహీంద్రా గ్రూప్ ఎయిరిండియాలో ఇన్వెస్ట్ చేస్తుందా అంటూ ఎవరో చేసిన ట్వీట్‌కు ఆయన ఈ విధంగా స్పందించారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్‌లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!







