రివ్యూ : జయదేవ్
- June 30, 2017
నటీనటులు :గంటా రవి, మాళవిక, పోసాని, వెన్నెల కిషోర్, తదితరలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు
సంగీతం: మణిశర్మ,
మూల కథ: అరుణ్‌కుమార్
దర్శకత్వం : జయంత్ సి. పరాంజీ
నిర్మాత : కె. అశోక్ కుమార్
సంగీతం : మణిశర్మ
విడుదల తేదీ : జూన్ 30, 2017
రాజకీయాలకు సినిమాలకు గట్టి బంధం ఉంది. అయితే ఈ బంధానికి స్క్రీన్ ప్లే మార్చి రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చాడు గంటా రవి.
ప్రభాస్ వంటి మాస్ హీరోను ఇంట్రడ్యూస్ చేసిన జయంత్ రవి ని తెరమీద పవర్ పుల్ పోలీస్ ని చేసాడు. జనాలు మెచ్చితేనే నటుడయినా, నాయకుడయినా రాణించగలుగుతాడు .. మరి గంటా రవి ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకున్నాడో చూద్దాం...
కథ :
అక్రమ క్వారీ వ్యాపారం చేస్తున్న మాచిరాజు( వినోద్ కుమార్ ) కి ఒక పోలీస్ అధికారి అడ్డుతగులుతాడు. అతన్ని హాత్య చేయిస్తాడు మాచిరాజు. ఆ హాత్య కేసు జయదేవ్(గంటారవి) పరిధిలోని పోలీస్ స్టేషన్ కి వస్తుంది. ఒక పోలీస్ కుటుంబానికి జరిగిన అన్యాయం పై రవి చేసిన పోరాటం ఎంటనేది మిగిలిన కథ..?
కథనం:
పోలీస్ పాత్రలను ఓవర్ యాక్షన్ తో నింపేయడం. అతీతమైన శక్తులు వచ్చిన వ్యక్తులుగా ప్రొజెక్ట్ చేయడం తెలుగు సినిమాలలో కనిపిస్తున్న ట్రెండ్. అయితే ఈ ట్రెండ్ ను బ్రేక్ చేసి ఒక రియలిస్టిక్ అప్రోచ్ తో సినిమాని నడిపాడు జయంత్. శేతుపతి మూవీ ఎక్కువుగా ఆకట్టుకన్న అంశమే ఇది. విజయ్ శేతుపతి అండర్ కరెంట్ యాక్షన్ కి తమిళంలో మంచి రెస్సాన్స్ వచ్చింది. జయదేవ్ విషయంలో కూడా జయంత్ అదే ఫార్ములాని ఫాలో అయ్యాడు. హీరో ని ఎలివేట్ చేసేందుకు ప్రత్యేకమైన సీన్స్ రాసుకోకుండా కథలోని ఎమోషన్స్ తోనే ఎలివేట్ అయ్యే ప్రయత్నం చేసాడు. మాస్ డైలాగ్స్ చెప్పడంలో జయదేవ్ పర్వాలేదనిపించాడు. అతని బాడీ లాంగ్వేజ్ పై మరికొంత శ్రర్ధ తీసుకొని ఉంటే ఆ క్యారెక్టర్ కి వెయిట్ పెరిగేది. మళయాళం మూవీ యాక్షన్ హీరో బిజు నుండి కొన్ని సన్నివేశాలను అరువు తెచ్చుకొని బిత్తిరి సత్తికి తగిలించాడు. కథ జరిగే దోసకాయలపల్లి బిత్తిరి సత్తి ఇమడలేక పోయినా కనిపించిన కాసేపు ఎంటర్ టైన్ చేసాడు. హీరోయిన్ క్యారెక్టర్ ని గ్లామర్ పంచేందుకు మాత్రమే వాడుకున్నాడు దర్శకుడు. సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ బలం తోడై రక్తి కట్టించాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ని రియలిస్టిక్ గా చూపించడంలో జయంత్ సక్సెస్ అయ్యాడు. హీరో ఇంటిపైకి విలన్స్ దాడి చేసే సన్నివేశం బాగుంది. సినిమాకు మరొక ప్లస్ పాయింట్ హీరోయిన్ మాళవిక రాజ్. చూడటానికి అందంగా కనిపిస్తూ ప్రేక్షకులకు కాస్త కనులవిందు చేసింది. పోలీస్ అంటే సూపర్ మాన్ ఇమేజ్ ని చూడటం అలవాటయినా ప్రేక్షకులకు ఈ పోలీస్ కాస్త కొత్తగా అనిపిస్తాడు. తన ఉద్యోగంలోని ప్రజర్స్ ని బాగా డిజైన్ చేసాడు. నేరస్థులను పట్టుకునేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తిగా సాగింది. మాస్ హీరోగా జయదేవ్ ని ఎస్టాబ్లిష్ చేసేందుకు జయంత్ తీసుకున్న కథనం బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది.
చివరిగా:
జయదేవ్ కొత్త తరహా పోలీస్ కథ.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్‌జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్‌లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్‌లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







