తోటి ప్రయాణికురాలి తో అసభ్య ప్రవర్తన, వ్యక్తి అరెస్ట్
- June 30, 2017
విమానంలో తోటిప్రయాణికురాలు నిద్రిస్తుండగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడో ప్రయాణికుడు. నిద్రిస్తున్న మహిళను అభ్యంతరకరంగా తాకుతూ ఆమెను వేధింపులకు గురిచేశాడు. విషయాన్ని బాధితురాలు ఎయిర్‌లైన్ సిబ్బంది దృష్టికి తీసుకురావడంతో.. వారు అతడిని పోలీసులకు అప్పగించారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జూన్ 27న తెల్లవారుజామున ఓ విమానం బెంగళూరు నుంచి ముంబయి బయల్దేరింది. అందులో ప్రయాణిస్తున్న సబీన్ హంజా అనే వ్యక్తి.. తన పక్కనే కూర్చున్న మహిళను వేధించాడు. మహిళ నిద్రిస్తుండగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు వెంటనే మేల్కొని సబీన్ ఆగడాలను గుర్తించి ఎయిర్‌లైన్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. తొలుత సబీన్ను హెచ్చరించిన సిబ్బంది.
విమానం ముంబయిలో దిగగానే అతడిని ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బందికి అప్పగించారు. అనంతరం సబీన్ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్‌జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్‌లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్‌లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







