ప్రభుదేవా డైరక్షన్ లో నటించనున్న ప్రభాస్
- June 30, 2017
కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా తీయబోయే తదుపరి చిత్రంలో ప్రభాస్ నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న 'ఖామోషి' చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రలో కన్పించనున్నట్లు వూహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 'సాహో' సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక ప్రభుదేవాతో కలిసి పనిచేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని గురించి ప్రభుదేవా మీడియాతో మాట్లాడుతూ.. 'కేవలం బిజినెస్ కోసం ఇద్దరం కలిసి సినిమా చేయడంలో అర్థంలేదు. నాకు ప్రభాస్‌తో సినిమా తీయాలనుంది. ఇప్పుడు ఆయన 'సాహో' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయ్యాక ఏ విషయం అనేది ప్రకటిస్తాం' అని చెప్పినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







