తెహ్రిక్ ఈ ఆజాదీ జమ్ము అండ్ కశ్మీర్ సంస్థపై నిషేధం విధించిన పాక్
- June 30, 2017
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు పాకిస్థాన్ దిగొచ్చింది. తమ దేశంలోని ఉగ్రవాది హపీజ్ సయీద్ అండదండలతో నడుస్తున్న తెహ్రిక్ ఈ ఆజాదీ జమ్ము అండ్ కశ్మీర్ సంస్థపై నిషేధం విధించింది. ఈ సంస్థే ప్రస్తుతం జమాత్ ఉద్ దవాగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2008లో ముంబయిలో పేలుళ్లకు ఈ ఉగ్రవాద సంస్థే మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఏమాత్రం ప్రోత్సహించరాదని, అలా చేస్తే అంతర్జాతీయ సమాజం తరుపున తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ఉన్నపలంగా ఉగ్రవాద చర్యలను నిలువరించే చర్యలు తీసుకోవాలని లేదంటే తమ నుంచి సహకారం అందబోదని చెప్పారు. దీంతో పాకిస్థాన్ తాజా చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత జనవరిలోనే హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బందం చేసిన పాక్ పోలీసులు అతడిని అరెస్టు మాత్రం చేయకుండా పరిశీలనలో ఉంచారు. అదే సమయంలో జమాత్ ఉద్ దవాపై కూడా ఓ కన్నేసి ఉంచారు. సయీద్‌పై ఎప్పుడైతే పాక్ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిందో అప్పటి నుంచే భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని లక్షిత దాడులు చేయించేందుకు జమాత్ సంస్థకు సంకేతాలు పంపించినట్లు ఆ మేరకు ఆ సంస్థ ముందుకు కదిలినట్లు తెలిసింది. ఇదే సమయంలో డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో జమాత్ ఉద్ దవాను నిషేధ సంస్థల జాబితాలో చేర్చింది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







