వేర్వేరు ప్రమాదాలలో 6 గురు మహిళలను రక్షించిన దుబాయ్ పోలీసులు

- June 30, 2017 , by Maagulf
వేర్వేరు ప్రమాదాలలో  6 గురు మహిళలను రక్షించిన దుబాయ్ పోలీసులు

దుబాయ్ : ఒక భవనంలోని లిఫ్ట్ లో అనూహ్యంగా చిక్కుకొన్న ఆరుగురు మహిళలను, ఒక గదిలో తాళం వేయబడి లోపల ఉండిపోయిన అనారోగ్య వ్యక్తిని సైతం దుబాయ్ పోలీస్ ల్యాండ్ రెస్క్యూ విభాగం రక్షించారని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దుబాయ్ పోలీస్ వద్ద ఉన్న భూ రక్షణ దళం విభాగం అధిపతి మేజర్ జనరల్ అబ్దుల్లా బిశోహ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈద్ సెలవులు సందర్భంగా ఐదు వేర్వేరు ప్రమాదాల్లో ఈ మహిళలు రక్షించబడ్డారు. అయితే, ఈ సంఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అతను తన గదిలో లాక్ చేయబడిన వ్యక్తి, అలాగే ఒక మినీబస్ మరియు రెండు కార్ల ప్రయాణీకులు, అధికారులు నిర్వహించిన సంఘటనల్లో రక్షించబడ్డారు. దుబాయ్లో వివిధ ప్రాంతాల్లో వేగవంతంగా పోలీసులు స్పందించడంతో వారినందరిని  రక్షించగలిగినట్లు వివరించారు. "ఈ ప్రమాదాల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రజల ప్రాణాలను కాపాడటానికి రెస్క్యూ బృందాల ప్రయత్నాలు విజయవంతమయ్యాయని ఆయన చెప్పారు. ఈ ప్రమాదాలన్నీ వేర్వేరు సంఘటనలుగా నమోదయ్యాయని తెలిపారు. ఈద్ సెలవులు రెండవ రోజు టేలర్  అల్ ఎమరాత్  ప్రాంతంలో ఒక విల్లా ఎలివేటర్ లో చిక్కుకొన్న  మహిళలు గురించి ఒక నివేదిక అందుకొని సంఘటనా స్థలానికి  తరలించారు ఒక ఎలివేటర్ యొక్క స్విచ్ కీ ఉపయోగించి ఆ మహిళలు రక్షించినట్లు ఆయన  పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com