ఇక ఆ వివాహాలు చట్టబద్దం

- June 30, 2017 , by Maagulf
ఇక ఆ వివాహాలు చట్టబద్దం

జర్మనీలో స్వలింగ సంపర్కులు విజ యం సాధించారు. వారు పెళ్లిళ్లు చేసుకునేందుకు జర్మనీ పార్లమెంటు ఓకే చెప్పింది. గత కొద్ది రోజులు గా కొనసాగుతున్న ఉత్కంఠకు శుక్రవారం తెరపడిం ది. స్వలింగ సంపర్కుల వివాహం అంశంపై ప్రవేశ పెట్టిన బిల్లుకు జర్మనీ పార్లమెంటు ఆమోదం తెలి పింది. జర్మనీ ఛాన్సలర్‌ ఎంజెలా మెర్కెల్‌తో సహా ఆమె పార్టీలోని పలువురు ఈ బిల్లును వ్యతిరేకించినా అది చట్టంగా రూపుదాల్చడం గమనార్హం. ఈ సంద ర్భంగా ఎంజెలా మెర్కెల్‌ మాట్లాడుతూ 'స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు వ్యతిరేకంగా ఓటు వేశాను. నా దృష్టిలో పెళ్లి అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ మధ్యే జరగాలి. పార్లమెంటు..సమాజంలో మరింత మార్పు ను ఆశించిందేమో' అని వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా జర్మనీ చట్టంలో కొత్తగా మార్పు చేసిన ప్రకారం 'ఒక స్త్రీ పురుషుడు, లేదా స్వలింగ వ్యక్తుల జీవితాల్లోకి వివాహం అడుగు పెట్టింది' అని కొత్త చట్టంలో పేర్కొన్నారు. తాజాగా చేసిన చట్టం ద్వారా స్వలింగ సంపర్కులకు కేవలం వివాహ అవకాశం మాత్రమే కాకుండా పిల్లలను కూడా దత్తత తీసుకునే అవకాశం ఇచ్చింది. ఇదివరకే జర్మనీ ఎగువ సభ ఈ బిల్లును ఆమోదించగా తాజాగా దిగువ సభలో 393/226 ఓట్లతో బిల్లు నెగ్గింది. ఈ ఏడాది చివరినాటికి ఈ చట్టం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com