కార్మికుల బహిష్కరణ ఖర్చుల గూర్చి మంగళవారం ఓటు వేయనున్న ఎంపీలు
- July 02, 2017
మనామా: పని అనుమతులకు విరుద్ధంగా తమ యజమానుల నుండి పారిపోయిన ప్రవాస కార్మికులను దేశం నుండి పంపించే సమయానికి వారి పారితోషకం తదితర ఖర్చులను వారిని నియమించిన ఉద్యోగ సంస్థలే చెల్లించేలా అనుమతిని కోరుతూ ప్రతినిధుల సభలో ఒక కమిటీ సిఫారసు చేసింది. సేవల కమిటీ సైతం ఇటీవలే ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రవాస కార్మికుల బహిష్కరణ సమయంలో పారితోషికాలు, ఇతర చెల్లింపులు యజమానులు చెల్లించకుండా అన్ని ఖర్చులను వలస కార్మికులు , వారిని నియమించిన ఉద్యోగ నియామక సంస్థలే చెల్లించే విధంగా అనుమతిని కోరనున్నారు. కమిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం, "ఈ ప్రతిపాదన ప్రకారం,వలస కార్మికులకు ఉపాధిని కల్పించిన యజమానిని మరియు వారికి చెందిన వ్యాపారాలను కాపాడటంతో పాటు, సక్రమ రీతిలో పని చేయని వలస కార్మికులను నియమించిన ఆయా ఉద్యోగ సంస్థలపై చర్యలను తీసుకొనేందుకు దోహదపడనుంది. ఎంపీలు అబ్దుల్రహ్మాన్ బుంజిద్, ఖలీద్ అల్ షెర్, ప్రతిపాదన "కార్మిక పరిస్థితులకు సంబంధించిన ఈ నిబంధనలు పని అనుమతి చట్టాలకు అనుగుణంగాఉన్నాయని మానవ హక్కుల సూత్రాలకు విరుద్ధంగా లేదు" అని పేర్కొన్నారు.లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ ఈ ప్రతిపాదనకు ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ దీనికి మద్దతు ఇచ్చాయి ఈ మంగళవారం ప్రతిపాదనపై సమీక్షించి ఎంపీలు ఓటు వేయాల్సిఉంది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







