దుబాయ్ లో మొట్టమొదటి స్పందించే గులాబీ రంగు వాహనం ప్రారంభం

- July 02, 2017 , by Maagulf
దుబాయ్ లో మొట్టమొదటి స్పందించే గులాబీ రంగు వాహనం ప్రారంభం

దుబాయ్: కొత్త గులాబీ రంగు  మొదటి స్పందన వాహనంను అంబులెన్స్ సేవల కోసం దుబాయ్ కార్పొరేషన్ (డిసిఎఎస్) ప్రారంభించింది.  నగరంలో మహిళలు, పిల్లలకు సేవలు  అందిస్తామని వారికి ఈ వాహనం ద్వారా సేవలను అందించేందుకే అంకితమివ్వనున్నట్లు అత్యవసర అధికారి తెలిపారు. గులాబీ అత్యవసర వాహనం దుబాయ్ లో  మొదటిది. అంబులెన్స్ సేవల కోసం దుబాయ్ కార్పొరేషన్ (డిసిఎఎస్)  అందిస్తున్న ప్రస్తుత 24 సేవలలో ఇది తాజాగా పరిగణించబడుతుందని  డిసిఎఎస్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖలీఫా బిన్ డార్రి చెప్పారు,మొట్టమొదటి గులాబీ ప్రతిస్పందన వాహనం సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. జనన కేసులు మరియు మహిళలు, పిల్లల ఇబ్బందులు గాయాల కేసులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటుంది. "స్పందన వాహనం ప్రధానంగా మహిళలకు లబ్ది చేకూర్చేస్తుంది అలాగే అన్ని రకాల కేసులను నిర్వహిస్తుంది. గర్భిణీ స్త్రీలకు, పింక్ కార్ల సహాయంతో వారి కేసులను వేగంగా పరిష్కరిస్తారు "అని ఆయన చెప్పారు.అంతేకాకుండా, గులాబీ వాహనం ఒక ఏడాది వయస్సు నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు మధ్య ఉన్న పిల్లల కేసులతో వ్యవహరించనుంది. మొదటి దశలో, వాహనం ఆల్ ట్విర్ మునిసిపాలిటీ సెంటర్లో ఉంచబడుతుంది ఉదయం11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు, 12 వరుసగా  గంటల వరకు మొత్తం డెయిరి  ప్రాంతంలో తన విధులను నిర్వర్తించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com